Saturday, May 8, 2010

ఇంకా పేరు పెట్టని కథ

"ఏరా తరుణ్!! ఈ రోజు ఎగ్జాం ఎలా రాశావ్ ?" అప్పుడే డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన మాధవ రావు బట్టలు మార్చుకుంటూ, కంప్యూటర్ మీద గేమ్స్ ఆడుతున్న కొడుకును అడిగాడు. "ఓ బానే రాసాను.90% ఎబోవ్ వస్తుంది" చెప్పాడు తరుణ్. తరుణ్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ రోజే ఆఖరు పరీక్ష. ప్రతీ రోజు ఈ పరీక్షలప్పుడు డ్యూటీ అయిపోయి ఇంటికి రాగానే మాధవ రావు కొడుకుని అడిగే మొదటి ప్రశ్న ఇదే. తరుణ్ సమాధానమూ ఇదే. ఓకే వీడికి తొంభయ్ శాతం పైగానే మార్కులు వస్తాయంటున్నాడు వీడిని ఏ IIT లోనో AIEEE లోనో కోచింగ్ ఇచ్చే మంచి కాలేజీ లో చేర్పిస్తే, ఆ తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ సంపాదించుకుంటాడు అని అనుకుంటూ, ఏ కాలేజీ లో చేర్పిస్తే బాగుంటుందో భార్య అభిప్రాయం కోసం హాల్లో టీవీ చూస్తున్న ప్రమీల ప్రక్కన సోఫా లో కుర్చున్నాడుమాధవ రావు.
"వీడు పరిక్షలు బాగానే వ్రాసాను అంటున్నాడు మరి. ఇంటర్మీడియట్ ఏ కాలేజీ అయితే బెటర్ అంటావు" భార్యను అడిగాడు
" దీనికి ఇంత ఆలోచించేదేముంది? ఇప్పటికి ఆ రెండు కాలేజీ ల నుండి ఒక పది మంది దాకా వచ్చి మీ అబ్బాయిని మా కాలేజీ లో చేర్పించమంటే మా కాలేజీ లో చేర్పిచండి అని ఒకటే పోరు పెడతానే ఉన్నారు గదా ! వీళ్ళు గాక ఇంకో రెండు కాలేజీ ల వాళ్ళు వచ్చి మేము కొత్తగా కాలేజీ స్టార్ట్ చేస్తున్నాము కొత్త కాన్సెప్ట్ తో కోచింగ్ ఇస్తాము అని ఊదర గొడుతూ ఉన్నారు.మీరు రేపు వెళ్లి మనకు దగ్గరగా ఉన్న ఈ కాలేజీ గురించి వాకబు చేయండి. మీ స్నేహితుల పిల్లలు కూడా ఇంటర్మీడియట్ కు వచ్చారు గదా!! వాళ్ళే కాలేజీ లలో చేర్పిస్తున్నారో, ఏది మంచి కాలేజీ యో తెలుసుకోండి" చెప్పింది ప్రమీల.
"సరేలే రేపు ఆఫీసు కు సెలవు పెట్టి ఈ పనిమీదే ఉంటాను" స్నానానికి లేస్తూ చెప్పాడు మాధవ రావు.
********
ఆ మర్నాడు మాధవ రావు తన ఫ్రెండ్స్ ను కొలీగ్స్ ను ఎంక్వయిరీ చేస్తే హిమాయత్ నగర్ లో IIT లో మంచి పేరు, మంచి లెక్చరర్స్ ఉన్న ఒక కార్పోరేట్ కాలేజీ ఉంది అని తెలుసుకుని తన కొడుకు ను తీసుకుని ఆ కాలేజీ కి వెళ్ళాడు. వాళ్ళు చాల మర్యాదగా కూర్చోపెట్టి, అన్ని వివరాలు అంటే పదవ తరగతి ఏ స్కూల్ లో చదివాడు, ప్రీ ఫైనల్ పరిక్షలలో ఎంత శాతం మార్కులు సాధించాడు, IIT లో విద్యార్థికి ఆసక్తి ఎంత మాత్రం ఉంది, చిరునామా, మొబైల్ నెంబర్ ఇలాంటి ఎన్నో వివరాలు అడిగి తెలుసుకుని ఒక రిజిష్టర్ లో వ్రాసుకున్నారు. తరువాత మేమొక టెస్ట్ పెడతాము అది రాయాలి అని చెప్పారు. కొడుకుతో ఆ టెస్ట్ రాయించిన పది నిమిషాలలో ఫలితాలు చెప్పారు. తరుణ్ ఆ టెస్ట్ లో చాల తక్కువ స్కోర్ చేయగలిగాడు. అక్కడే ఉన్న ఒక ఇన్ చార్జి మీ వాడు IIT కి పనికి raadu


No comments:

Post a Comment